చైనాలో ఘోర విమాన ప్రమాదం
21-03-2022 Mon 14:11
- 133 మందితో వెళుతున్న విమానం
- వూజో సిటీ సమీపంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలిన వైనం
- కొండపై భారీ అగ్నిప్రమాదం
- హుటాహుటీన తరలివెళ్లిన సహాయక బృందాలు

చైనాలో ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది. నైరుతి చైనాలో ఈ ఘటన జరిగింది. ఈ బోయింగ్-737 విమానం గ్వాంగ్జీ ప్రావిన్స్ గగనతలంలో ప్రయాణిస్తుండగా వూజో నగరం సమీపంలోని గ్రామీణ ప్రాంతాలో కూలిపోయింది. ఈ విమానంలో 133 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. విమానం ఓ కొండపై కూలిపోగా, అక్కడ అగ్నిప్రమాదం సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం.
ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన సహాయక బృందాలను తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన తీరు, విమానం కూలిపోయిన తర్వాత జరిగిన అగ్నిప్రమాదం దృష్ట్యా అందులోని వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువేనని భావిస్తున్నారు.
More Latest News
ఎంఎస్ స్వామినాథన్‌కు వెంకయ్య పరామర్శ
2 minutes ago

దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!
18 minutes ago

టీహబ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
24 minutes ago

రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ... కొత్త చైర్మన్ గా ఆకాశ్ అంబానీ
37 minutes ago

30న తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల
50 minutes ago

వచ్చే నెల 4న కోర్టుకు కంగనా రనౌత్
53 minutes ago

ఏపీలో 60 మంది మావోయిస్టుల లొంగుబాటు
53 minutes ago

కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
1 hour ago
