90 ఏళ్లలో 12 మంది భారత క్రికెటర్లకే సాధ్యమైన టెస్ట్ రికార్డు

04-03-2022 Fri 13:40
Indian Players with 100 Test Matches

ఏ క్రికెటర్ కు అయినా తన కెరీర్ లో 100 టెస్ట్ మ్యాచ్ ల మైలురాయిని చేరుకోవడం నిజంగా విశేషమైనది. విరాట్ కోహ్లీ శుక్రవారంతో ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు. 100 టెస్ట్ మ్యాచ్ ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఎంతో నిలకడగా రాణిస్తే తప్ప ఒక క్రికెటర్ కు ఎక్కువ అవకాశాలు రావు. అందుకే ప్రతిభావంతులకే ఈ రికార్డు పరిమితమవుతోంది. 


ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే జట్టు ఆ ఆటగాడిపై నమ్మకంతో మరిన్ని అవకాశాలను కల్పిస్తుంటుంది. దాంతో 100 టెస్ట్ ల మైలురాయిని చేరుకునేందుకు మార్గం ఏర్పడుతుంది. పైగా ఏటా జరిగే టెస్ట్ మ్యాచ్ లు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ అరుదైన రికార్డును సాధించడం క్రికెటర్లకు నిజంగా అసాధారణమైనదే.

144 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో ఇప్పటికి 100 టెస్ట్ మ్యాచుల మైలురాయిని సాధించిన క్రికెటర్లు అంతర్జాతీయంగా చూస్తే 71 మందే ఉన్నారు. అందులో భారత్ నుంచి 12 మందికే ఇది సాధ్యపడింది. 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రికార్డు మాత్రం ఒక్క సచిన్ పేరిటే ఉండడం గమనించాలి. భారత్ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ లను 1932లో ప్రారంభించింది. ఇంగ్లండ్ లోని లార్డ్స్ మైదానంలో 1932 జూన్ 25-28 తేదీల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడి ఓటమి చవిచూసింది.
 
సెంచురీ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన వారు
క్రికెటర్ 
 ఆడిన మ్యాచ్ లు
 చేసిన పరుగులు
 తీసిన వికెట్లు
సచిన్2001592146
రాహుల్ ద్రవిడ్163132651
వీవీఎస్ లక్ష్మణ్13487812
అనిల్ కుంబ్లే1322506619
కపిల్ దేవ్1315248434
సునీల్ గవాస్కర్125101221
దిలీప్ వెంగ్ సర్కార్11668680
సౌరవ్ గంగూలీ113721232
ఇషాంత్ శర్మ104785311
హర్బజన్ సింగ్1032224417
వీరేంద్ర సెహ్వాగ్103850340
విరాట్ కోహ్లీ100--


..Read this also
నా వెంట పడకు అక్కా.. అంటూ బాలీవుడ్ నటికి రిషబ్ పంత్ కౌంటర్
  • ‘ఆర్పీ’ తన ఇంటికి వచ్చాడని ఇంటర్వ్యూలో చెప్పిన నటి ఊర్వశీ రౌతేలా
  • ఆర్పీ అంటే రిషబ్ పంతే అని అంటున్న అభిమానులు
  • ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పిన రిషబ్
  • అబద్ధాలకూ హద్దు ఉంటుందంటూ ఇన్ స్టాగ్రామ్ లో పంత్ పోస్ట్


..Read this also
బీసీసీఐ అనుమతిస్తే.. విదేశీ లీగ్​ లో మెంటార్​ గా ధోనీ!
  • దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ఫ్రాంచైజీని ఏర్పాటు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం
  • జోహన్నెస్ బర్గ్ సూపర్ కింగ్స్ అని పేరు పెట్టే యోచన
  • ఈ జట్టుకు ధోనీని మెంటార్ గా నియమించే అవకాశం

..Read this also
భారత క్రికెటర్లు ఐపీఎల్ దాటి రాకపోవడంపై గవాస్కర్ స్పందన
  • ఐపీఎల్ కే పరిమితమైన భారత క్రికెటర్లు
  • విదేశీ టీ20 లీగ్ లలో మనవాళ్లు కనిపించని వైనం
  • పలు దేశాల మాజీ క్రికెటర్ల విమర్శలు
  • వారి బాధ అర్థం చేసుకోదగినదేనన్న గవాస్కర్


More Latest News
Economy losing money freebies distribution a serious issue Supreme Court
rishabh pant conters urvashi rautela
Adani Group to invest RS 41653 crores to set up alumina refinery in Odisha
Chiranjeevi wishes on Rakhi
Jagdeep Dhankhar takes oath as Vice President of India
Karthikeya 2 movie update
As Covid cases surge Delhi govt reintroduces Rs 500 fine for not wearing masks
MS Dhoni is to be involved in Cricket South Africa T20 league as Mentor
Income tax payers cannot join this govt pension scheme from October
AP Govt bans derogatory words against Nayee Brahmins
Chennakeshava Reddy Movie
IT dept seizes Rs 58 crore cash and 32 kg gold in raids conducted in Maharashtra
6 Health benefits of cycling Weight loss to reduced anxiety
Women leaders tie rakhis to Jagan
India not planning to ban Chinese smartphones priced at less than Rs 12000
..more