హోదా అంశం తొలగింపునకు బీజేపీ ఎంపీ జీవీఎల్ కారణం: వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపణ
16-02-2022 Wed 17:06
- ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకుంటున్నారు
- అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలి
- ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా చెప్పారన్న భరత్

కేంద్ర హోంశాఖ అజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించడానికి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావే కారణమని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. తెలుగు వ్యక్తి అయి ఉండి ఏపీ అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు.
ఏపీకి జరుగుతున్న అన్యాయంపై వైసీపీ ఎంపీలందరం అనేకసార్లు మాట్లాడామని... విభజన హామీలు, హోదాను సాధించేందుకు తాము కృషి చేస్తున్నామని భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 2,100 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా చెప్పారని తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో కొత్త జాతీయ రహదార్లను నిర్మిస్తున్న కేంద్రానికి మార్గాని కృతజ్ఞతలు తెలిపారు.
More Latest News
వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
23 minutes ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
48 minutes ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
1 hour ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
1 hour ago

బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'
2 hours ago
