ఉద్యోగులతో శాంతియుత చర్చల దిశగా చొరవ చూపండి: సీఎం జగన్ కు నాగబాబు సూచన
04-02-2022 Fri 17:07
- నిన్న ఏపీ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం
- ఉద్యోగులకు మద్దతు పలికిన పవన్
- జీతాలను తగ్గించడం అనేది గుండెను పిండేస్తోందన్న నాగబాబు
- ఉద్యోగుల సమస్యను సత్వరం పరిష్కరించాలని మనవి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించడం తెలిసిందే. ఆయన ఉద్యోగులకు మద్దతు పలికారు. పలు అంశాల్లో ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు కూడా స్పందించారు.
"ప్రభుత్వ వ్యవస్థల్లో ఉద్యోగులు ఎంతటి చిన్నవారైనా కావొచ్చు... కానీ జీతాల్లో పెరుగుదల, అలవెన్సులు, ఇంక్రిమెంట్లు అనేవి ఆ వేతన జీవులకు చిరు ఆశాకిరణాల వంటివి. మా జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పినట్టు... ఆ చిన్న ఆశలను కూడా ఉద్యోగులకు అందకుండా చేయడం, ఉన్న జీతాలను తగ్గించడం అనేది గుండెను పిండేస్తోంది. ఈ నేపథ్యంలో నేను కోరేది ఏంటంటే... ఉద్యోగులతో శాంతియుత చర్చలకు ఏపీ సీఎం జగన్ చొరవ చూపాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలి" అంటూ ట్వీట్ చేశారు.
More Latest News
ఆరోగ్య బీమా ఏ వయసులో తీసుకోవాలి..?
14 minutes ago

ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై ఐక్యరాజ్యసమితి ఆందోళన
36 minutes ago

ఉద్ధవ్ థాకరే గూండాయిజం అంతం కావాలి.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: నవనీత్ కౌర్
57 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago
