కిన్నెర వీణ కళాకారుడు మొగిలయ్యకు ఇంటి స్థలం, రూ.1 కోటి నగదు ప్రకటించిన సీఎం కేసీఆర్
28-01-2022 Fri 21:18
- భీమ్లా నాయక్ లో పాట పాడిన మొగిలయ్య
- కిన్నెర వీణతో ప్రాచుర్యం
- జాతీయస్థాయికి మొగిలయ్య కళా నైపుణ్యం
- పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం
- ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసిన మొగిలయ్య

పవన్ కల్యాణ్ చిత్రం భీమ్లా నాయక్ లో పాట పాడడంతో కిన్నెర వీణ కళాకారుడు మొగిలయ్య పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 12 మెట్ల కిన్నెర వీణపై ఆయన పలికించే సంగీతం జాతీయస్థాయిలో గుర్తింపుకు నోచుకుంది. ఆయనకు కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించి గౌరవించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పద్మశ్రీ మొగిలయ్యకు భారీ నజరానా ప్రకటించారు.
హైదరాబాదు నగరంలో ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణం కోసం రూ.1 కోటి నగదు కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. పద్మశ్రీకి ఎంపికైన నేపథ్యంలో మొగిలయ్య ఇవాళ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ADVERTSIEMENT
More Telugu News
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. టీవీ నటి కాల్చివేత
53 minutes ago

తెలంగాణలో ఉన్న మసీదులన్నింటిని తవ్వాలి.. శవం వస్తే మీది.. శివలింగం వస్తే మాది: బండి సంజయ్
12 hours ago

దావోస్‌లో కేటీఆర్‌తో సీరం అధినేత పూనావాలా భేటీ
12 hours ago

పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్
12 hours ago
