తెలంగాణలో మరో 3,980 మందికి కరోనా పాజిటివ్
24-01-2022 Mon 20:38
- గత 24 గంటల్లో 97,113 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,439 కొత్త కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 33,673 మందికి చికిత్స

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 97,113 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 3,980 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 344, రంగారెడ్డి జిల్లాలో 234, హనుమకొండ జిల్లాలో 159, ఖమ్మం జిల్లాలో 110 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,38,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,01,047 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,673 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,075కి పెరిగింది.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
9 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
10 hours ago

మహానాడు నేపథ్యంలో విజయసాయిరెడ్డి విమర్శల పర్వం
10 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
10 hours ago
