తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు
21-01-2022 Fri 19:46
- గత 24 గంటల్లో 1,20,243 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు
- రాష్ట్రంలో రెండు మరణాలు
- ఇంకా 29,127 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించగా 4,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,670 కొత్త కేసులు వెల్లడి కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, రంగారెడ్డి జిల్లాలో 301, హనుమకొండ జిల్లాలో 178, ఖమ్మం జిల్లాలో 117 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 1,920 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,26,819 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,93,623 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 29,127 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,069కి పెరిగింది.
ADVERTSIEMENT
More Telugu News
కుమారుడి మరణాన్ని తట్టుకోలేక దంపతుల ఆత్మహత్య
8 minutes ago
దేశంలో దొంగ నోట్లు పెరిగాయ్: ఆర్బీఐ సంచలన నివేదిక
17 minutes ago

మా మార్కాపురం మిత్రుడంటూ.. ‘మన్ కీ బాత్’లో తెలుగు వ్యక్తిని ప్రస్తావించిన ప్రధాని మోదీ
43 minutes ago
