గుడివాడలో టీడీపీ నేతల అరెస్ట్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్

21-01-2022 Fri 14:14
Nara Lokesh furious after police arrests TDP leaders

కృష్ణా జిల్లా గుడివాడలో కొడాలి కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో ఏర్పాటు చేశారంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. అయితే, గుడివాడ వెళ్లి క్యాసినో నిగ్గు తేల్చేందుకు ప్రయత్నించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వర్ల రామయ్య, బోండా ఉమ, ఆలపాటి రాజా, మరికొందరు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో నిర్వహించి ప్రజల నుంచి వందల కోట్లు కాజేసిన గడ్డం గ్యాంగ్ ను వదిలేసి నిజనిర్ధారణకు వెళ్లిన టీడీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మహానుభావుల పురిటిగడ్డ గుడివాడను గడ్డం గ్యాంగ్ భ్రష్టుపట్టించిందని విమర్శించారు. మింగడానికి ఏమీ మిగలక ఆఖరికి జనాల ఒంటిపై ఉన్న గుడ్డలు సైతం లాగేసేందుకు ఏకంగా క్యాసినో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

కే కన్వెన్షన్ జూదానికి అడ్డాగా మారిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినా, వైసీపీ రంగులతో కళ్లు మూసుకుపోయిన పోలీసులకు కనిపించలేదని లోకేశ్ విమర్శలు చేశారు. దీని వెనకున్న అసలైన సూత్రధారులపై చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా క్యాసినో నడిపినప్పుడు అడ్డురాని కొవిడ్ నిబంధనల పేరు చెప్పి టీడీపీ నేతలను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

..Read this also
వైసీపీని వీడి టీడీపీలో చేరిన గోవ‌ర్ధ‌న్ రెడ్డి... సాద‌రంగా ఆహ్వానించిన చంద్ర‌బాబు
  • దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంక‌ట‌రెడ్డి సోద‌రుడి కుమారుడే గోవ‌ర్ధ‌న్ రెడ్డి
  • ప‌దేళ్ల పాటు వైసీపీలో కొన‌సాగిన వైనం
  • అనుచ‌రుల‌తో క‌లిసి టీడీపీలో చేరిన తెనాలి నేత‌


..Read this also
పార్టీ మార్పు తప్పనిసరి.. టీడీపీకి రాజీనామా చేస్తా: కొత్తకోట దయాకర్‌రెడ్డి
  • పుట్టిన రోజు సందర్భంగా దేవరకద్రలో కార్యకర్తలతో సమావేశం
  • టీడీపీని వీడుతానంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్న దయాకర్‌రెడ్డి
  • కార్యకర్తలు సూచించిన పార్టీలోకి వెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే

..Read this also
త్వరలోనే మాధవ్ వీడియోపై పూర్తి నివేదికను ప్రజల ముందు ఉంచుతాం: టీడీపీ నేత పట్టాభి
  • ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారం
  • ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ సీఐడీ చీఫ్
  • స్టాఫోర్డ్ రిపోర్టు వందశాతం వాస్తవం అన్న పట్టాభి 
  • నిజాలను కప్పిపుచ్చడం మానుకోవాలని హితవు


More Latest News
Pak lawyers thrash man who sexually assaulted medical student in Punjab province
Actress Namitha delivers twin boys
Rajasthan government plans to provide smartphones to Over1 crore women
 Women dont need men for sex Kanishka Soni
YCP MLA Kapu Ramachandra Reddy son in law died
two telugu peple are in the manish sisodia case
Boycott Putin from G20 says Rishi Sunak
telangana tops odf plus villages ranks
Many people asked me for commitment says actress Tejashwi Madivada
ap minister rk rojas photo selected for mumbai photo exibition
Nitish Kumar helicopter had emergency landing
Somy Ali sensational comments on Salman Khan
ap bjp starts its campaign on ap roads
komatireddy rajagopal reddy will join in bjp in the presence of amit shah
..more