దేశంలో 24 గంటల్లో 3.47 లక్షల కరోనా కేసుల నిర్ధారణ
21-01-2022 Fri 09:58
- మొన్నటి కేసుల కంటే నిన్న 29,722 కేసులు అధికం
- నిన్న కరోనా వల్ల 703 మంది మృతి
- యాక్టివ్ కేసులు 20,18,825
- మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న దేశంలో 3,47,254 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొన్న నమోదైన కేసుల కంటే నిన్న 29,722 కేసులు అధికంగా నమోదయ్యాయి. అలాగే, నిన్న కరోనా వల్ల 703 మంది ప్రాణాలు కోల్పోయారు.
24 గంటల్లో 2,51,777 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 20,18,825 మందికి చికిత్స అందుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతంగా ఉంది. దేశంలో మొత్తం 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ADVERTSIEMENT
More Telugu News
జాన్వీకపూర్ ను ఒప్పించే ప్రయత్నంలో కొరటాల!
16 minutes ago

పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ 6 రోజుల డెడ్ లైన్
17 minutes ago

మేము బాదడానికి అవకాశం ఎక్కడిది..? : కేఎల్ రాహుల్
37 minutes ago

హైదరాబాద్ లో అలర్ట్.. కొత్తగా ఒమిక్రాన్ బీఏ 5 కేసు
58 minutes ago
