ఇంట్లోనే ఒమిక్రాన్ టెస్ట్.. 45 నిమిషాల్లోనే ఫలితం

21-01-2022 Fri 08:02
Kriya Medical Tech gets ICMR approval for COVID testing kit

దేశంలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన తర్వాత కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. అయితే, వైరస్‌లో చాలా రకాలు ఉండడంతో సోకింది ఏ రకమో తెలియక జనం అయోమయానికి గురవుతున్నారు. వైద్యులు కూడా నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపితే తప్ప నిర్ధారించలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో గంటలోపే మనకు సోకింది ఏ రకమో తెలుసుకునేందుకు ఓ టెస్టింగ్ కిట్ అందుబాటులోకి వచ్చింది. చెన్నైకి చెందిన క్రియా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ రూపొందించిన ఈ కిట్ పేరు ‘క్రివిడా నోవస్ కొవిడ్-19 టెస్టింగ్ కిట్’.

ఇమ్యూజెనిక్స్ బయోసైన్స్ అనే సంస్థతో కలిసి ఈ కిట్‌ను తయారుచేసింది. దీని ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే ఫలితం తెలుసుకోవవచ్చని క్రియా పేర్కొంది. తాము ఏ వేరియంట్ బారినపడ్డామో ఇది కచ్చితంగా చెప్పేస్తుందని తెలిపింది.

క్రియా అభివృద్ధి చేసిన ఈ కిట్‌కు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆమోదం కూడా లభించింది. చెన్నైలోని తమ ప్లాంట్‌లో వారానికి 50 లక్షల కిట్లను ఉత్పత్తి చేస్తున్నామని, అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచుతామని క్రియా మెడికల్ టెక్నాలజీస్ పేర్కొంది.


ADVERTSIEMENT

More Telugu News
F3 movie update
BJP criticizes Rahul Gandhi who was seen photographed with Brit MP Jeremy Corbyn
Surya in shiva movie
Violence in Amalapuram
Akira Nandan plays Dosti song from RRR on Piano
Major movie concludes censorship
Ram in Harish Shankar movie
Sugar mountains underneath sea grass meadows
Muslims contributed very much to our country says Owaisi
Pawan Kalyan opines on MLC Anantha Udayabhaskar issue
Markets ends in losses
Kejriwal says he is tearful after Punjab CM Bhagwant Mann action on corrupted minister
Sekhar movie agreements are on my name says Beeram Sudhakar Reddy
Ministers Committee meeting with Employees Associations concluded
Nayanathara and Vignesh Sivan offers prayers to their kuladaivam
..more