పిక్ ఆఫ్ ది డే.. మెగాస్టార్ తో కలిసి మీసం మెలేసిన నేచురల్ స్టార్!
20-01-2022 Thu 20:17
- ప్రేక్షకులను ఆకట్టుకున్న 'శ్యామ్ సింగరాయ్'
- ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి
- సినిమా ఎంతో నచ్చిందన్న చిరు

నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చిరు అభినందించారు. అంతేకాదు నానితో కలిసి దిగిన పిక్ ను ఆయన షేర్ చేశారు. ఈ ఫొటోలో ఇద్దరూ మీసాలు మెలేస్తూ, చిరునవ్వులు చిందిస్తుండటం అందరినీ ఆకట్టుకుంటోంది.
క్రిస్మస్ సందర్భంగా 'శ్యామ్ సింగరాయ్' సినిమా విడుదలయింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సమయంలో సినిమా విడుదలయినప్పటికీ... మంచి వసూళ్లను రాబట్టింది. దేవదాసి వ్యవస్థపై పోరాటం చేసే కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సాయిపల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
9 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
9 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
10 hours ago

ఈ సభ చూస్తే జగన్ కు పిచ్చెక్కడం ఖాయం: చంద్రబాబు
11 hours ago
