జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్షలు జరుగుతున్నాయి.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దు: ఏపీ మంత్రి ఆదిమూలపు
19-01-2022 Wed 20:33
- ఏపీలో కొనసాగుతున్న పాఠశాలలు
- కరోనా కేసులు పెరుగుతుండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
- అన్ని స్కూళ్లను శానిటైజ్ చేస్తున్నామన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. తెలంగాణలో పాఠశాలలకు సెలవులు కొనసాగుతున్నప్పటికీ... ఏపీలో మాత్రం స్కూళ్లను తెరిచారు. ఇంకోవైపు కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడటం ఆందోళనను పెంచుతోంది.
ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ, పాఠశాలల పరిస్థితిని ప్రతిరోజు జిల్లా కలెక్టర్ స్థాయిలో సమీక్షిస్తున్నామని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా సోకిన ఉపాధ్యాయులకు వెంటనే సెలవులు ఇస్తున్నామని చెప్పారు. అన్ని స్కూళ్లను శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలని చెప్పారు.
ADVERTSIEMENT
More Telugu News
అంపైర్ గా సెహ్వాగ్... అసలేం జరిగిందంటే...!
10 hours ago

ఐపీఎల్ ఫైనల్ రేపే... టైటిల్ షాట్ ఎవరిదో!
10 hours ago

మహానాడు నేపథ్యంలో విజయసాయిరెడ్డి విమర్శల పర్వం
10 hours ago

టీడీపీ మహానాడుపై వైసీపీ మంత్రుల ఫైర్
11 hours ago
