ఉద్యోగ సంఘాలకు మద్దతుగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్నా: ఎంపీ రఘురామ
18-01-2022 Tue 15:31
- పీఆర్సీపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
- ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించిన రఘురామ
- ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలపాలని పిలుపు

ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మద్దతు పలికారు. రివర్స్ పీఆర్సీకి నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని రఘురామ వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తన నివాసంలోనే దీక్ష చేపడతానని అన్నారు.
ఉద్యోగులకు సీఎం జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. ఈ అంశంలో తాను ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తున్నానని, రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు సంఘీభావం తెలపాలని రఘురామ పిలుపునిచ్చారు.
ADVERTSIEMENT
More Telugu News
మా మార్కాపురం మిత్రుడంటూ.. ‘మన్ కీ బాత్’లో తెలుగు వ్యక్తిని ప్రస్తావించిన ప్రధాని మోదీ
23 minutes ago

ఆఫ్రికా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా, ఇరాన్ నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడింది: అసదుద్దీన్ ఒవైసీ
2 hours ago
