తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్... నలుగురు నక్సల్స్ మృతి
18-01-2022 Tue 14:20
- బీజాపూర్ అటవీప్రాంతంలో తుపాకుల మోత
- మరణించిన మావోల్లో ఏరియా కమిటీ కార్యదర్శి
- ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్ర గాయాలు
- హెలికాప్టర్ ద్వారా వరంగల్ తరలింపు

తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో తుపాకులు గర్జించాయి. బీజాపూర్ సమీపంలోని కర్రెలగుట్ట అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మరణించిన మావోయిస్టుల్లో ఏటూరు నాగారం-మహదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్రగాయాలు కావడంతో అతడిని హెలికాప్టర్ ద్వారా వరంగల్ కు తరలించారు. ఈ మేరకు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వివరాలు తెలిపారు. సంఘటన స్థలం పరిసరాల్లో ప్రస్తుతం గాలింపు జరుగుతోందని వివరించారు.
ADVERTSIEMENT
More Telugu News
వెంకన్నసేవలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి
59 minutes ago

ఆఫ్రికా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా, ఇరాన్ నుంచి వలస వచ్చిన వారితోనే భారత్ ఏర్పడింది: అసదుద్దీన్ ఒవైసీ
2 hours ago
