చికిత్స కోసం అమెరికా వెళ్లిన కేరళ సీఎం... అక్కడి నుంచే పాలన!
15-01-2022 Sat 19:59
- అమెరికాలో రెండు వారాలు గడపనున్న విజయన్
- 2018లో మిన్నెసోటాలో చికిత్స
- తదుపరి చికిత్స కోసం అమెరికా పయనం
- ఈ నెల 29న తిరిగిరాక

కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. 2018లో అమెరికాలోని మిన్నెసోటాలో మేయో క్లినిక్ లో చికిత్స పొందిన ఆయన, తదుపరి చికిత్స కోసం ఇవాళ పయనమయ్యారు. భార్య, వ్యక్తిగత సహాయకుడు వెంటరాగా అమెరికా తరలి వెళ్లారు.
ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ ఆసక్తికర ప్రకటన చేశారు. తాను రాష్ట్రంలో లేనప్పటికీ ఎవరికీ బాధ్యతలు అప్పగించబోవడంలేదని స్పష్టం చేశారు. అమెరికా నుంచే పరిపాలిస్తానని, అందుకోసం టెక్నాలజీ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నాగానీ పరిపాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
గతంలో అమెరికా వెళ్లినప్పుడు ఈపీ జయరాజన్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈసారి మాత్రం విదేశీ గడ్డపై నుంచే పాలన కొనసాగించాలని పినరయి విజయన్ నిర్ణయించుకున్నారు. కాగా, విజయన్ ఈ నెల 29న అమెరికా నుంచి భారత్ తిరిగి రానున్నారు.
More Latest News
మూవీ రివ్యూ: 'కార్తికేయ 2'
4 hours ago

తెలంగాణలో తాజాగా 440 మందికి కరోనా పాజిటివ్
5 hours ago

వరల్డ్ చాంపియన్ షిప్‌కు పీవీ సింధు దూరం... కారణం చెబుతూ భావోద్వేగానికి గురైన స్టార్ షట్లర్
5 hours ago

విజయనగరం జిల్లాలో పాత ఇల్లు కూల్చుతుండగా బయటపడిన లాకర్... మాదంటే మాదని యజమాని, కూలీల మధ్య వివాదం
6 hours ago
