రాజ'శేఖర్' నుంచి రేపు తొలి గీతం విడుదల
04-01-2022 Tue 19:12
- రాజశేఖర్ హీరోగా 'శేఖర్'
- జీవిత దర్శకత్వంలో చిత్రం
- 'లవ్ గంటే' అనే పాట విడుదల చేయనున్న చిత్రబృందం
- శేఖర్ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం

విలక్షణ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శేఖర్'. ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 4 గంటలకు తొలి పాట విడుదల కానుంది. 'లవ్ గంటే' అనే హుషారైన పాట అందరినీ అలరిస్తుందని చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. అనూప్ రూబెన్స్ బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.
కాగా, 'శేఖర్' చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు కూడా భాగస్వాములు. మలయాళంలో హిట్టయిన 'జోసెఫ్' చిత్రాన్ని శేఖర్ గా రీమేక్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్ గెటప్ విలక్షణంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరికొన్నిరోజుల్లో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
More Latest News
వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల
1 minute ago

మూడున్నరేళ్లు ఏమార్చిన జగన్ కు.. మరో ఏడాది మోసం చేయడం పెద్ద విషయమేమీ కాదు: టీడీపీ నేత జవహర్
26 minutes ago

మహేశ్ తో త్రివిక్రమ్ చేసేది మాస్ యాక్షన్ మూవీనే!
39 minutes ago

గుజరాత్ లో రూ.1,125 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
42 minutes ago

'సలార్'లో ఆయన విలనా? పోలీస్ ఆఫీసరా?
1 hour ago

మళ్లీ 10 వేలు దాటిన కరోనా కేసులు
1 hour ago

బాలీవుడ్ కి వెళుతున్న 'బింబిసార'
1 hour ago

నితిన్ గడ్కరీని బీజేపీ కీలక పదవి నుంచి తొలగించడంపై తీవ్ర విమర్శలు గుప్పించిన శరద్ పవార్ పార్టీ
1 hour ago
