'గని' రిలీజ్ డేట్ ఖరారు!

25-12-2021 Sat 10:28
Ghani Release Date Confirmed

వరుణ్ తేజ్ కథానాయకుడిగా 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబి - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో నడుస్తుంది. బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఈ పాత్రను చాలా సహజంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకుని వెళ్లడం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ పొందాడు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కొంతసేపటి క్రితమే ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.

ఇక ముఖ్యమైన పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర .. నదియా నటించారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మొదట్లో డిసెంబర్ 3న రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమా ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది. ఆ తరువాత మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఇప్పుడు మార్చి 18వ తేదీన ఫిక్స్ చేశారు..

..Read this also
'హ్యాపీ బర్త్ డే' మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్!
  • లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రదారిణిగా 'హ్యాపీ బర్త్ డే'
  • కామెడీ డ్రామా జోనర్లో సాగే కథ 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • జులై 8వ తేదీన సినిమా విడుదల


..Read this also
విడుద‌లైన 50 రోజుల త‌ర్వాతే ఓటీటీకి సినిమాలు: టాలీవుడ్ నిర్మాతల కీల‌క నిర్ణ‌యం
  • ఓటీటీలో త్వ‌రితగ‌తిన సినిమాల‌తో న‌ష్ట‌మ‌న్న బ‌న్నీ వాసు
  • సినిమాల ఓటీటీ రిలీజ్‌పై నిర్మాతల స‌మావేశం
  • జులై 1 త‌ర్వాత ఒప్పందాలు జ‌రిగే సినిమాల‌కే కొత్త నిబంధ‌న అన్న నిర్మాత‌లు

..Read this also
'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు!
  • తెలుగు - తమిళ భాషల్లో రూపొందిన 'ది వారియర్'
  • లింగుసామి దర్శకత్వంలో నటించిన రామ్ 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న నదియా
  • అనంతపూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • జులై 14వ తేదీన సినిమా రిలీజ్


More Latest News
Private bus collide to lorry in prakasam dist one dead
Yoga and meditation gets into school academic calendar in Telangana
Royal Bengal Tiger roaming around Anakapalle dist
heavy security in hyderabad amid modi tour on july 2nd 3rd
Is Actor Vishal Contest in Kuppam Against Chandrababu
maharashtra cm uddhav Rhackeray resigns
Supreme Court gives go ahead to the floor test in the Maharashtra Assembly tomorrow
intermediate supplementary exams will start from august 1st in telangana
1989 batch IPS officer Vivek Phansalkar is the mumbai new police commissioner
ap cm ys jagan orders 2 months free accomodation to employees in amaravati
ctor Swara Bhaskar Receives Death Threat In Letter
chandrababu agrees to attend madanapalli mini mahanadu on july 6th
haryana governor Bandaru Dattatreya honoured Harish Rao and Buggana Rajendranath Reddy
maharashtra cm uddhav Rhackeray emotional comments in cabinet meeting
GST is now grihasti sarvnaash tax says Rahul gandhi
..more