వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్ధం
25-12-2021 Sat 08:39
- బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో అగ్నిప్రమాదం
- ల్యాడిల్కు రంధ్రం పడి నేలపాలైన ఉక్కు ద్రవం
- మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

వైజాగ్ ఉక్కు పరిశ్రమలో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్ ఫర్నేస్ ప్లాంట్-2లో ఈ ప్రమాదం జరిగింది. ల్యాడిల్కు రంధ్రం పడడంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు లారీలు ఆ మంటలకు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More Latest News
నటించకుండానే రణబీర్ కపూర్ కు మొదటి సారి రూ.250 చెక్!
20 minutes ago

భారతీయుల పెట్టుబడుల్లో అత్యధికం రియల్టీలోనే..!
42 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
1 hour ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
1 hour ago
