ఫలితాల విషయంలో న్యాయం జరిగేంత వరకు ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తాం: రేవంత్ రెడ్డి
20-12-2021 Mon 19:17
- ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల
- 51 శాతం మంది ఫెయిల్
- ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
- ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఇటీవల విడుదల కాగా, 51 శాతం మంది ఫెయిలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ఫలితాల తీరు పట్ల మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడగా, విపక్షాలు టీఆర్ఎస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులు హైదరాబాదులో భారీ ర్యాలీ చేపట్టారు.
దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఫలితాల విషయంలో న్యాయం జరిగేంత వరకు ఇంటర్ విద్యార్థులకు తాము మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను అణచివేసే బదులు, వెంటనే సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. బలవన్మరణం బాట పట్టకుండా విద్యార్థులను కాపాడాలని, ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.
More Latest News
కొడాలి నానిని ఓడించడం తర్వాత సంగతి... ముందు పోటీ చేయడానికి అభ్యర్థి ఉన్నాడేమో చూస్కోండి: పేర్ని నాని
24 minutes ago

తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో పాసైన అవిభక్త కవలలు వీణా-వాణి
40 minutes ago

సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడంతో పెద్ద హీరోలకు తీరని నష్టం: నిర్మాత బన్నీ వాసు
44 minutes ago

స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు
56 minutes ago

జులై 1న తెలంగాణ టెట్ ఫలితాల విడుదల
1 hour ago
