పాకిస్థాన్ లో భారీ పేలుడుకు పాల్పడిన ఉగ్రవాదులు.. దద్దరిల్లిన కరాచీ!
18-12-2021 Sat 16:43
- కరాచీలో ఓ భవనంలో భారీ పేలుడు
- 10 మంది దుర్మరణం
- పెద్ద సంఖ్యలో గాయపడిన జనాలు

ఉగ్రదాడితో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ దద్దరిల్లింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే షేర్షా పరాచా చౌక్ లోని ఓ భవనంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 10 మంది దుర్మరణంపాలయ్యారు. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనాలు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. ఇది ఉగ్రవాదుల పనేనని పాక్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే, ఇంతవరకు ఏ ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు పాల్పడింది తామేనని ప్రకటించుకోలేదు. మరోవైపు కరాచీలో హైఅలర్ట్ ప్రకటించారు.
More Latest News
నా వెంట పడకూ అంటూ బాలీవుడ్ నటికి రిషబ్ పంత్ కౌంటర్
4 minutes ago

ఒడిశాలో అదానీ గ్రూపు భారీ అల్యూమినియం పరిశ్రమ
15 minutes ago

అంతర్జాతీయ స్థాయిలో 'కార్తికేయ 3'
1 hour ago

నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే చట్టపరమైన చర్యలు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
1 hour ago

సైక్లింగ్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!
2 hours ago

లోకేశ్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి: కార్తి
2 hours ago
