మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు
13-12-2021 Mon 16:07
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లక్ష్మీనారాయణపై సీఐడీ కేసులు
- ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఐఏఎస్
- 15 రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన స్పృహ కోల్పోయారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 15 రోజుల పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
More Latest News