నీ ఊసరవెల్లి రాజకీయాలతో రైతులు ఆగమైపోతున్నారు: సీఎం కేసీఆర్ పై షర్మిల ధ్వజం
10-12-2021 Fri 15:35
- ధాన్యం కొనుగోలు అంశంపై షర్మిల స్పందన
- వడ్లు కొనకుండా రైతులను వేధిస్తున్నారని వ్యాఖ్యలు
- వ్యవసాయానికి ఘోరీ కడుతున్నారని ఆగ్రహం
- రైతుకు పాడె కడుతున్నారంటూ మండిపాటు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తరచుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. కేసీఆర్ ఊసరవెల్లి రాజకీయాలతో రైతులు ఆగమైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని గప్పాలు కొట్టే దొర గారు... ఆ రైతుల ఆదాయం నెలకు రూ.1,697 మాత్రమేనని గ్రహించాలని హితవు పలికారు. ఇప్పుడు ఆ ఆదాయం కూడా మిగలొద్దని వరి వేయొద్దంటున్నారు అంటూ ఆరోపించారు.
"ఓసారి వడ్లు కొంటానంటావ్... మరోసారి వడ్లు కొనేది లేదంటావ్. మీది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదు, వ్యవసాయానికి ఘోరీ కట్టే ప్రభుత్వం. వానాకాలం వడ్లు కొనకుండా రైతులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. వరి వేసి ఉరి వేసుకునే బదులు భూములను బీడుగా వదిలేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఉండాల్సిన రైతుకు సర్కారు పాడె కడుతోంది" అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.
More Telugu News
ఈ యువ ఆటగాడి క్రికెటింగ్ బుర్ర అమోఘం: గవాస్కర్
2 minutes ago

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'
6 minutes ago

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు!.. జాబితా ఇదే!
26 minutes ago

మొద్దునిద్ర పోతున్నావా?: కేసీఆర్పై షర్మిల విమర్శలు
33 minutes ago

గ్రూప్ నుంచి మీరు నిష్క్రమించినట్టు ఎవరికీ తెలియదు... వాట్సాప్ నుంచి త్వరలో కొత్త ఫీచర్
34 minutes ago

జగన్ సర్కారుపై జనంలో వ్యతిరేకత... గడప గడపకులో నిలదీతలే నిదర్శనం: చంద్రబాబు
35 minutes ago

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు ఊరట
35 minutes ago
