హెలికాప్టర్ ప్రమాద స్థలికి వెళ్లనున్న తమిళనాడు సీఎం స్టాలిన్

08-12-2021 Wed 15:38
Tamilnadu CM MK Stalin decides to go to helicopter crash site

తమిళనాడులో నీలగిరి వద్ద హెలికాప్టర్ కుప్పకూలిన ప్రమాదం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఆ హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన అర్ధాంగితోపాటు పలువురు సైనికాధికారులు ఉన్నారు. మొత్తం 14 మంది హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా, 11 మంది మరణించగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో బిపిన్ రావత్ కూడా ఉన్నారు.

 కాగా, ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. ఘటన స్థలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సాయంత్రం చెన్నై నుంచి కోయంబత్తూరు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నీలగిరి వెళతారు.

కాగా, ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి కథనం ప్రకారం.... మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ ను చూశామని చెప్పారు. హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో చెట్ల మీదుగా ముగ్గురు వ్యక్తులు కిందికి పడిపోవడం గమనించామని, అయితే మంటలు వ్యాపించడంతో తాము వెళ్లలేకపోయామని ఆ వ్యక్తి వెల్లడించారు.


More Telugu News
Akhilesh Yadav to contest from Karhal constituency
Sumanths Malli Modalaindi movie to release in OTT
Andhra Pradesh cabinet to meet tomorrow
All employees unions uniting to fight against AP govrnment
Saireddy Vs Raghurama
Nani with Chiranjeevi pic going viral
Corona positive for 4207 new people in Telangana
Somireddy fires on AP CS
Hari Hara Veeramallu movie update
Union leaders misleading employees says Perni Nani
Meera Jasmine Re entry
Bomb blast in Pakistan Lahore
Sharmila fires on KCR
Shekar movie update
Andhra Pradesh registers 12615 new Corona Cases
..more