హైదరాబాదు జూ పార్కులో యువకుడి కలకలం... సింహం ఎన్ క్లోజరులో దూకేందుకు యత్నం
23-11-2021 Tue 18:16
- సాయికుమార్ అనే యువకుడి హంగామా
- సింహం ఎన్ క్లోజరు పైభాగానికి చేరిన వైనం
- యువకుడి కోసం కాపు కాసిన సింహం
- యువకుడ్ని తరలించిన జూ సిబ్బంది

హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. సింహం ఉండే ఎన్ క్లోజరులో దూకేందుకు ప్రయత్నించి అందరినీ హడలెత్తించాడు. ఎన్ క్లోజరు పైభాగంలో ఉన్న గుహ వంటి నిర్మాణం మీదకు ఎక్కిన యువకుడు లోపలికి దిగేందుకు ప్రయత్నించగా, జూ సిబ్బంది అడ్డుకున్నారు. కాగా, ఆ యువకుడు గుహపై ఉండగా, కొన్ని అడుగుల కిందనే సింహం ఉండడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు.
ఆ సింహం కూడా కాసేపు అతడు దూకుతాడేమోనని అక్కడే కాపు కాసింది. కాసేపటి తర్వాత అది అవతలికి వెళ్లిపోయింది. అయితే ఎన్ క్లోజరు వెనుక నుంచి వచ్చిన జూ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువకుడి పేరు సాయికుమార్ అని గుర్తించారు.
More Latest News
చిప్ ఆధారిత పాప్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా..?
4 minutes ago

ఓటర్ల కంటే రాజకీయ నాయకుల ఆయుష్షు 4.5 ఏళ్లు ఎక్కువ.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
8 minutes ago

నాగచైతన్య ‘థాంక్యూ’ రెండు వారాలు వెనక్కి
39 minutes ago

'స్వాతిముత్యం' నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్!
57 minutes ago

హిందీ రీమేక్ దిశగా 'భీమ్లా నాయక్'
1 hour ago

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
1 hour ago

నిరాశపరిచిన సీనియర్ నటి అర్చన రీ ఎంట్రీ!
1 hour ago
