రేపు హిందీ 'జెర్సీ' నుంచి ట్రైలర్ రిలీజ్!

22-11-2021 Mon 17:40
Jersey hindi movie trailer release on 23rd November

నాని కథానాయకుడిగా కొంతకాలం క్రితం తెలుగులో 'జెర్సీ' సినిమా వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ తో ముడిపడిన ఎమోషనల్ స్టోరీ ఇది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన గౌతమ్, అదే కథను బాలీవుడ్ కి తీసుకెళ్లాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు.

ఆయన సరసన మృణాలిని ఠాకూర్ కనిపించనుంది. పంకజ్ కపూర్ .. శిశిర్ శర్మ .. శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారడంతో, డిసెంబర్ 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం 5:30 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ .. దిల్ రాజు .. అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరించారు.


More Telugu News
Kiran Abbavaram
Severe Depression Moving At 32 KMPH Speed May Hit AP Coast By Tomorrow Early
Tomorrow is solar eclipse
2nd Test India win the toss and elect to bat
Bengaluru Doctor Who Contracted Omicron Has No Travel History
vijaya sai on corona new variant
Akhanda movie update
ishant and two others out from match
Junior NTR response on Balakrishna Akhanda movie
RRR movie update
Hero Cop Saves Woman From Falling Under Train In Bengal
Shyam Singha Roy movie update
First Omicron patient left India on Nov 27
corona bulletin in inida
Fancy offers for Rajasekhar movie
..more