అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న పాకిస్థాన్.. స్కాట్లాండ్‌పై భారీ విజయం

08-11-2021 Mon 06:33
Pakistan crush Scotland in their last league match

టీ20 ప్రపంచకప్‌లో పాక్ విజయాల పరంపర కొనసాగుతోంది. పసికూన స్కాట్లాండ్‌తో గత రాత్రి జరిగిన గ్రూప్ 2 చివరి లీగ్ మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. షోయబ్ మాలిక్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు కెప్టెన్ బాబర్ ఆజం సమయోచిత ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ తొలుత 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.

అనంతరం 190 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా పరాజయాలను పరిపూర్ణం చేసుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. స్కాట్లాండ్ బ్యాటర్లలో ఒక్క రిచీ బెరింగ్టన్ తప్ప మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేకపోయారు.

37 బంతులు ఆడిన బెరింగ్టన్ 4 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 54 పరుగులు చేశాడు. ఓపెనర్ మున్సీ 17, మైఖేల్ లీస్క్ 14 పరుగులు చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. స్కాట్లాండ్ బౌలర్లను పాక్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. పరుగుల వరద పారించారు.

బాబర్ ఆజం 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేయగా, హఫీజ్ 19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో షోయబ్ మాలిక్ శివాలెత్తాడు. సిక్సర్లతో స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 18 బంతులు మాత్రమే ఎదుర్కొన్న షోయబ్ ఒక ఫోర్, 6 సిక్సర్లతో 54 పరుగులు (నాటౌట్) చేశాడు. విధ్వంసకర ఆటతీరుతో ఆకట్టుకున్న అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

ఈ మ్యాచ్‌తో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ 1లో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లండ్, గ్రూప్‌ 2లో రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా; గ్రూప్ 2లో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్, గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నేపథ్యంలో నేటి భారత్-నమీబియా మధ్య జరుగుతున్న గ్రూప్ 2 చివరి మ్యాచ్‌కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

..Read this also
బాధ్యత తీసుకున్నప్పుడల్లా స‌త్తా చాటాను: హార్దిక్ పాండ్యా
  • ఐర్లాండ్ టూర్‌లో టీమిండియా కెప్టెన్‌గా పాండ్యా
  • ఇప్ప‌టికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా
  • రేపే ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌


..Read this also
స్టోక్స్ కు దీటైన ఆటగాడు టీమిండియాలో అతడే: మంజ్రేకర్
  • జులై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ టెస్టు
  • ఇంగ్లండ్ కు స్టోక్స్ ఉన్నాడన్న మంజ్రేకర్
  • భారత్ కు పంత్ ఉన్నాడని వెల్లడి
  • మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలడని కితాబు

..Read this also
హజ్​ యాత్ర కోసం భారత్​ తో సిరీస్​ కు దూరమైన ఇంగ్లండ్​ స్పిన్నర్​.. ఎవరంటే..!
  • మక్కా వెళ్లేందుకు ఆదిల్ రషీద్ కు ఇంగ్లండ్ బోర్డు అనుమతి
  • రెండు వారాలు యాత్రలో పాల్గొననున్న ఆదిల్
  •  జులై 7-17 మధ్య భారత్, ఇంగ్లండ్ టీ20, వన్డే సిరీస్ లు


More Latest News
Actor Sai Kiran approaches police
tdp leader n amarnath reddy says mantri developers is the accused in jagan ed cases
RGV tweets again on Droupadi Murmu
Five rowdy sheeters expelled from Bezawada
hardik pandya talks about t20 series with ireland
Asaduddin Owaisi describes Maha politics as dance of monkeys
Sanjay Raut warns rebel ministers
ts government take back its decision on teachers properties issue
Corona active cases number crosses three thousand mark in Telangana
Mallikarjun Kharge tweet on bank frauds in modi regime
Chandrababu attends personal assistant marriage in Vijayawada
pawan kalyan mother anjana devi gives one and half lacks janasena koulu raitu bharosa
ED has arrested Mantri Developers Director Sushil P Mantri
Biden signs on key bill to restrict gun culture
Pushpa 2 movie update
..more