ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు.. మంత్రి పెద్దిరెడ్డి, ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోండి: ఎస్ఈసీకి ఎమ్మెల్సీ మంతెన లేఖ
07-11-2021 Sun 08:02
- కుప్పం వైసీపీ సభలో ఇద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు
- ఈసీ ఆదేశాలకు ఇది విరుద్ధం
- తక్షణం చర్యలు తీసుకోండి

ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్రవిడ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఏకే వేణుగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన సభలో వీరు ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆరోపించారు.
ఆ సభలో మంత్రి పెద్దిరెడ్డిని రిజిస్ట్రార్ వేణుగోపాల్‌రెడ్డి కలిశారని, ఈసీ ఆదేశాలకు ఇది విరుద్ధమని, కాబట్టి ఇలా కలవడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
More Latest News
యూపీలో పాకిస్థాన్ జెండా ఎగురవేసిన యువకుడి అరెస్ట్
18 minutes ago

పోలీసు తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఫొటో, వీడియో ఇదిగో
2 hours ago

‘అమ్మా.. నిన్ను మిస్సవుతున్నాం’.. శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా జ్ఞాపకాలను పంచుకున్న జాన్వి, ఖుషి
2 hours ago
