దీపాల వెలుగులో సరయు నదీ సోయగం... గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన అయోధ్య నగరం
04-11-2021 Thu 22:15
- దీపావళి సందర్భంగా నగరంలో 9 లక్షలకు పైగా దీపాలు
- సరయు నదీ తీరంలో దీపోత్సవం
- వరుసగా ఐదో ఏడాది కూడా రికార్డు
- సర్టిఫికెట్ అందజేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు

దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దీపకాంతులతో వెలుగులు విరజిమ్మింది. అంతేకాదు, ప్రపంచ రికార్డు కూడా సాధించింది. 9 లక్షలకు పైగా దీపాలతో అయోధ్య నగరం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. దీపావళిని పురస్కరించుకుని ఇక్కడి సరయు నదీ తీరంలో దీపోత్సవం ఏర్పాటు చేశారు. ఒక్కసారే లక్షల దీపాలు ప్రజ్వలనం చేయడంతో ఆ ప్రాంతమంతా కన్నుల పండువలా మారింది.
ఇక్కడి రామ్ కీ పైడీ ప్రాంతంలో ఇలా చమురుతో దివ్వెలు వెలిగించడం వరుసగా ఐదోసారి కూడా గిన్నిస్ రికార్డు పుటల్లోకెక్కింది. గిన్నిస్ బుక్ ప్రతినిధుల బృందం సమక్షంలో ఈ దీపోత్సవం నిర్వహించారు. రికార్డు సాధించినట్టు నిర్ధారించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఆ మేరకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
5 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
6 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
7 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
8 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
8 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
9 hours ago
