ఫాంహౌస్‌ కేసులో.. హీరో నాగ‌శౌర్య తండ్రిని విచారణకు పిలిచిన పోలీసులు

03-11-2021 Wed 13:02
naga shourya father to go ps

టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి హైద‌రాబాద్ శివారులోని మంచిరేవులలో లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో జూదం నిర్వ‌హిస్తున్న‌ట్లు ఇటీవ‌ల పోలీసుల‌కు స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడులు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌ధాన నిందితుడు గుత్తా సుమ‌న్‌ను కోర్టు రెండు రోజుల పోలీసుల క‌స్ట‌డీకి అప్ప‌గించింది. ఈ కేసులో నాగ‌శౌర్య తండ్రి ర‌వీంద్ర ప్ర‌సాద్‌ పాత్ర‌పైనా పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఫాంహౌస్‌ రెంటల్ అగ్రిమెంట్ కు సంబంధించిన ప‌త్రాల‌ను తీసుకురావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ర‌వీంద్ర ప్ర‌సాద్ ఈ రోజు పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. కాగా, ఓ ఫాంహౌస్‌ను గ‌తంలో ఓ మాజీ ఉన్న‌తాధికారి నుంచి నాగ‌శౌర్య తండ్రి ర‌వీంద్ర ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అందులో గుత్తా సుమ‌న్ అనే వ్య‌క్తి జూదం నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపింది. గుత్తా సుమ‌న్‌పై ఏపీలో ఉన్న కేసుల‌పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.


More Telugu News
AP Govt issues fresh orders on PRC implementation
Sreesanth registers his name for IPL Mega Auction
Telangana daily corona cases bulletin
Centre announces Padma Awards
Bride Groom rallies in snow to reach in time for wedding
Chinna Jeeyar Swamy met Telangana Governor Tamilisai Soundarrajan
Former coach Ravi Shastri opines on Team India recent loses in South Africa tour
Rajampeta MLA Meda Mallikarjuna Reddy wrote CM Jagan for new district
 Maheshwari said about Gulabi movie incident
Shaurya Chakra to Sepoy Jaswanth Reddy
Ntr in Buchhi Babu movie
Kodali Nani asks BJP leaders do not fall into TDP trap
Prabhas in Karan Johar Movie
Vishnu Vardhan Reddy slams YCP ministers
Vellampalli meets China Jeeyar Swamy
..more