బంగ్లాదేశ్ టాపార్డర్ ను కకావికలం చేసిన సఫారీ బౌలర్లు... నిప్పులు చెరిగిన రబాడా
02-11-2021 Tue 16:39
- అబుదాబిలో దక్షిణాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్
- టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
- మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
- 45 పరుగులకే 6 వికెట్లు డౌన్
- రబాడాకు 3 వికెట్లు

టీ20 వరల్డ్ కప్ లో నేడు గ్రూప్-1లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ సఫారీ బౌలర్లు విజృంభించారు. దాంతో బంగ్లాదేశ్ 45 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కేవలం 23 పరుగుల వ్యవధిలో బంగ్లా జట్టు ఈ ఐదు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా, దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడా నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ టాపార్డర్ హడలిపోయింది. రబాడా 3 వికెట్లు తీయగా, నోర్జే, ప్రిటోరియస్, షంసీ తలో వికెట్ తీశారు.
More Latest News
హైదరాబాదులో 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్... ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
4 hours ago
