మంగళవారం మరదలు బయల్దేరిందంటూ షర్మిలపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
28-10-2021 Thu 13:06
- నిన్న పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి
- ఈ క్రమంలోనే షర్మిలపై పరోక్ష వ్యాఖ్యలు
- ఉద్యోగాలను ఆంధ్రోళ్లు దోచుకునే కుట్రంటూ ఆరోపణలు

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన టీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. షర్మిలనుద్దేశించి మంగళవారం మరదలు బయల్దేరిందంటూ కామెంట్ చేశారు.
‘‘రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ దీక్షలు చేయడానికి మంగళవారం మరదలు ఒకామె బయల్దేరింది’’ అంటూ వ్యాఖ్యానించారు. ఆమె డిమాండ్ వెనుక 20 శాతం కోటాలో తెలంగాణ ఉద్యోగాలను పొందేందుకు ఆంధ్రోళ్ల కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు.
ప్రస్తుతం వైఎస్ షర్మిల ప్రజాప్రస్థాన యాత్రను చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలనూ ఆమె కొనసాగిస్తున్నారు.
More Latest News
ఇది వినడానికే సిగ్గుగా ఉంది: విజయశాంతి
3 hours ago

తెలంగాణలో తాజాగా 477 కరోనా పాజిటివ్ కేసులు
3 hours ago
