'శ్యామ్ సింగ రాయ్'లో వాసు పాత్రలో నాని!

14-10-2021 Thu 17:25
advertisement

నాని తాజా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నాని కొత్త లుక్ తో కనిపించనున్నాడు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాలో, నాని సరసన ముగ్గురు కథానాయికలు కనువిందు చేయనున్నారు.

ప్రధాన కథానాయికగా సాయిపల్లవి కనిపించనుండగా, మరో రెండు పాత్రల్లో కృతిశెట్టి .. మడొన్నా సెబాస్టియన్ అలరించనున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలో నాని పాత్రను పరిచయం చేస్తూ ఒక మోషన్ పోస్టర్ ను వదిలారు. అది అమ్మవారి నేపథ్యంలోనిది కావడం విశేషం.

మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేక ఓటీటీలో వదులుతారా? అనే విషయంలో అంతా క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా డిసెంబర్లో థియేటర్లకు రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు..

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement