సింగరేణి గనుల నేపథ్యంలో నడిచే నాని కొత్త కథ!

14-10-2021 Thu 11:59
advertisement

నాని కథానాయకుడిగా రూపొందిన 'టక్ జగదీష్' ఓటీటీ ద్వారా వీక్షకులను అలరించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులను తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి, 'శ్యామ్ సింగ రాయ్' సిద్ధంగా ఉంది.

ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న 'అంటే సుందరానికి' సినిమా కూడా సెట్స్ పైనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేసే పనిలోనే నాని ఉన్నాడు. ఆ వెంటనే తన 29వ సినిమాగా ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ రేపు మధ్యాహ్నం ఉంటుందని ముందుగానే చెప్పారు. శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, రేపు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement