మంగళగిరి ఆలయం గాలి గోపురానికి పగుళ్లు.. డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ
04-10-2021 Mon 07:08
- నెల రోజుల క్రితం కూలిన ఆలయ ప్రహరీ
- నాలుగు రోజుల క్రితం డ్రోన్ కెమెరాతో గాలి గోపురం చిత్రీకరణ
- పగుళ్లు, రాళ్ల మధ్య ఖాళీలు ఉన్నట్టు గుర్తింపు
- త్వరలోనే మరమ్మతులు చేపడతామన్న ఎమ్మెల్యే ఆళ్ల

మంగళగిరిలో ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గాలి గోపురంలో పగుళ్లు ఏర్పడ్డాయి. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆలయ ప్రహరీ దక్షిణ నైరుతి వైపు కొంత కూలిపోయింది. ఈ క్రమంలో తూర్పు గాలి గోపురంపై అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. అధికారులు నాలుగు రోజుల క్రితం డ్రోన్ కెమెరాలతో గోపురాన్ని అన్ని వైపుల నుంచి చిత్రీకరించారు. గోపురానికి ఏర్పడిన పగుళ్లు ఇందులో స్పష్టంగా కనిపించాయి.
వీటిని పరిశీలించిన నిపుణులు గోపురానికి పగుళ్లతోపాటు కట్టుబడి రాళ్ల మధ్య ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. వీటికి తక్షణం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పగుళ్ల విజువల్స్లను దేవాదాయశాఖ ఉన్నతాధికారుల పరిశీలనకు పంపనున్నారు. వారు పరిశీలించిన అనంతరం గాలిగోపురానికి అవసరమైన మరమ్మతులు చేపడతామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ADVERTSIEMENT
More Telugu News
చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ
50 minutes ago

ఐదు భాషల్లో ఎన్టీఆర్ 30వ చిత్రం... కొరటాల శివ దర్శకత్వం... రౌద్రం ఉట్టిపడేలా స్పెషల్ వీడియో
1 hour ago

'అఖండ' సీక్వెల్ కథపై జరుగుతున్న కసరత్తు!
2 hours ago
