బండ్ల గణేశ్ కు ఆ అర్హత లేదు: నిర్మాత యలమంచిలి రవిచందర్
02-10-2021 Sat 14:55
- 'మా' ఎన్నికల్లో నిన్న ఆసక్తికర పరిణామం
- జనరల్ సెక్రటరీ రేసు నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్
- నామినేషన్ ఉపసంహరణ
- గణేశ్ నిర్మాతల మండలిలోనూ సభ్యుడన్న యలమంచిలి

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ 'మా' జనరల్ సెక్రటరీ రేసు నుంచి తప్పుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. నామినేషన్ ఉపసంహరించుకుంటున్నానని వెల్లడించారు. దీనిపై టాలీవుడ్ నిర్మాత యలమంచిలి రవిచందర్ స్పందించారు.
బండ్ల గణేశ్ నిర్మాతల మండలిలోనూ సభ్యుడని, నటులకు సంబంధించిన ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడని అన్నారు. మరో సంఘంలో సభ్యత్వం ఉన్న వ్యక్తి 'మా' బరిలో దిగేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు. అందుకే 'మా' ఎన్నికల్లో తన నామినేషన్ ను బండ్ల గణేశ్ వెనక్కి తీసుకున్నారని యలమంచిలి వివరించారు. 'మా' బరిలో దిగేందుకు బండ్ల గణేశ్ కు అర్హతలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫిలిం చాంబర్ కు లేఖ రాశారని తెలిపారు.
ADVERTSIEMENT
More Telugu News
ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
23 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
1 hour ago
