ఉదయం మేనిఫెస్టో విడుదల చేసి మధ్యాహ్నానికి 'మా' పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్
02-10-2021 Sat 14:14
- 'మా' ఎన్నికల్లో మరో కీలక పరిణామం
- బరిలో లేనంటూ సీవీఎల్ ప్రకటన
- నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడి
- అన్ని విషయాలపై రెండ్రోజుల్లో ప్రెస్ మీట్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబరు 10న జరగనున్నాయి. ప్రధాన కార్యదర్శి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు బండ్ల గణేశ్ నిన్న ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. నేడు అంతకంటే విస్మయకర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉదయం తన ప్యానెల్ మేనిఫెస్టో విడుదల చేసి రేసులో ఉన్నానంటూ సంకేతాలు పంపిన నటుడు సీవీఎల్ నరసింహారావు మధ్యాహ్నానికి మనసు మార్చుకున్నారు.
'మా' ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన నామినేషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 'మా' పదవుల కంటే 'మా' సభ్యుల సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా సీవీఎల్ పేర్కొన్నారు. మరో రెండ్రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
ADVERTSIEMENT
More Telugu News
శుభ్ మాన్ గిల్ కు కోహ్లీ వార్నింగ్... వీడియో ఇదిగో!
3 minutes ago

కేన్స్ లో పూజా హెగ్డేకి చేదు అనుభవం... ఏం జరిగిందంటే...!
31 minutes ago

ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
59 minutes ago
