రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ ను తీయమన్నందుకు.. పోలీసుపై చెయ్యిచేసుకున్న వ్యక్తి
01-10-2021 Fri 21:29
- బీహార్‌లో వెలుగు చూసిన వింత ఘటన
- పోలీసును కొడుతుంటే వారించి అడ్డుకున్న స్థానికులు
- కాసేపటికి బైక్ అక్కడే వదిలి పారిపోయిన నిందితుడు

రోడ్డుపై అడ్డంగా బైక్ ఆపావేంటని అడిగితే పోలీసులపైనే దాడికి దిగాడో వ్యక్తి. ఈ ఘటన బీహార్‌లోని జెహనాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, ఒక వ్యక్తి నడిరోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా బైక్ ఆపాడు. ఇది చూసిన ట్రాఫిక్ పోలీసు అతన్ని హెచ్చరించాడు.
రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ తీసేయాలని సూచించాడు. దీంతో ఆ వ్యక్తికి కోపం వచ్చేసింది. పోలీసుతో గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా సదరు ట్రాఫిక్ పోలీసుపై చెయ్యిచేసుకున్నాడు. ఇదంతా చూసిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు.
ఆ తర్వాత సదరు నిందితుడు బైక్ అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాధిత ట్రాఫిక్ పోలీసు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ADVERTSIEMENT
More Telugu News
ఎన్టీఆర్ కథపై బుచ్చిబాబు కసరత్తు పూర్తి కాలేదట!
6 minutes ago

మీది షరతుల్లేని ప్రేమ... ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా: ఎన్టీఆర్
49 minutes ago

కోలీవుడ్ యంగ్ హీరో జోడీగా సాయిపల్లవి!
1 hour ago
