పవన్-పోసాని వివాదం: తనను లాగుతూ తన పేరుతో ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డ హైపర్ ఆది
30-09-2021 Thu 12:51
- పోసానిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు అనుచిత వ్యాఖ్యలు
- తనకు ట్విట్టర్ ఖాతా లేదని చెప్పిన హైపర్ ఆది
- సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీనటుడు పోసాని కృష్ణమురళీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసానిపై సామాజిక మాధ్యమాల్లో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇందులోకి బుల్లితెర కమెడియన్ హైపర్ ఆదిని లాగుతూ ఆయన పేరుతో పోస్టులు చేస్తున్నారు.
దీనిపై హైపర్ ఆది తాజాగా స్పందించాడు. అటువంటి వారిపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హైపర్ ఆది ఫేస్బుక్ ద్వారా హెచ్చరించాడు. తనకు ట్విట్టర్ ఖాతా లేదని ఆయన స్పష్టం చేశాడు. తన పేరిట చేస్తోన్న ట్వీట్లను నమ్మవద్దని కోరాడు. తాను ఏదైనా చెప్పాలనుకుంటే ఫేస్బుక్ లోని తన అధికారిక ఖాతా ద్వారా వీడియో రూపంలోనే చెబుతానని అన్నారు.
ADVERTSIEMENT
More Telugu News
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
7 hours ago

తెలంగాణలో తాజాగా 29 మందికి కరోనా
8 hours ago

అల్మోరా ప్రాంతం నుంచి ఈ స్వీట్ తీసుకురమ్మని ప్రధాని మోదీ చెప్పారు: బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్
8 hours ago

రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
9 hours ago

దావోస్ లో వరుస సమావేశాలతో సీఎం జగన్ బిజీ
9 hours ago

సంచలన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు... దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు జట్టు ఎంపిక
10 hours ago
