ప్లే ఆఫ్ ఆశల్లేవ్... ఇవాళ సన్ రైజర్స్ ఏం చేస్తుందో?

27-09-2021 Mon 19:56
advertisement

ఒక విజయం, 8 ఓటములు... ఇదీ ఐపీఎల్-14లో 9 మ్యాచ్ ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి! పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ ఆశలు ఇప్పటికే గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు రాజస్థాన్ రాయల్స్ తో అప్రాధాన్య మ్యాచ్ లో తలపడుతోంది.

ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. 4 ఓవర్లు ముగిసిన అనంతరం ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ఓపెనర్ జైశ్వాల్ (21), కెప్టెన్ సంజు శాంసన్ (6) క్రీజులో ఉన్నారు.

గత మ్యాచ్ లలో వరుసగా ఓటమిపాలైన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ తోనైనా ఆ పరంపరకు అడ్డుకట్ట వేస్తుందా? లేక ప్రత్యర్థికి మరోసారి దాసోహం అంటుందా? చూడాలి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement