దసరాకి 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ ప్రారంభం!

27-09-2021 Mon 12:36
advertisement

పవన్ కల్యాణ్ కెరియర్లో చెప్పుకోదగిన సంచలన విజయాన్ని సాధించిన చిత్రంగా 'గబ్బర్ సింగ్' కనిపిస్తుంది. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. అప్పటి నుంచి అంతా ఈ కాంబినేషన్లో మరో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఈ కాంబినేషన్లో ఇంతకాలానికి ఒక ప్రాజెక్టు సెట్ అయింది.

ఈ ఇద్దరి కాంబినేషన్లో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా రూపొందనుంది. ఇటీవలే ఈ టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా 'విజయదశమి' రోజున, అంటే అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా మొదలుకానుందని చెబుతున్నారు. పవన్ సరసన నాయికగా పూజ హెగ్డే ఖాయమైందీ .. లేనిది కూడా ఆ రోజున తెలుస్తుందని అంటున్నారు. 'దువ్వాడ జగన్నాథం'.. 'గద్దలకొండ గణేశ్' వంటి మెగా హీరోల హిట్ సినిమాల తరువాత హరీశ్ చేస్తున్న ఈ సినిమాపై, సహజంగానే అంచనాలు ఉన్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement