మధ్యప్రదేశ్‌లో దారుణం.. మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం

26-09-2021 Sun 08:05
Lady Constable Raped by three men in Madhyapradesh

మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నిందితుడు తన సోదరుడి బర్త్‌డే అంటూ పిలిచి స్నేహితులతో కలిసి మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. నీమచ్ జిల్లాలో ఈ నెల మొదట్లో ఈ ఘటన జరగ్గా.. 13న బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు నిన్న వెల్లడించారు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడితోపాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా నిందితుడు పరిచయం అయ్యాడు. స్నేహం క్రమంగా పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది. ఈక్రమంలో తన తమ్ముడి పుట్టిన రోజంటూ బాధితురాలిని ఆహ్వానించాడు. అక్కడకు వెళ్లిన ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రధాన నిందితుడు, అతడి సోదరుడితోపాటు మరో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అ

త్యాచారం అనంతరం వీడియో తీశారని తెలిపింది. ప్రధాన నిందితుడి తల్లి, అతడి బంధువు తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తన నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

..Read this also
స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి మోదీకి స్వాగతం పలికిన యూఏఈ అధ్యక్షుడు... వీడియో ఇదిగో!
 • జర్మనీ పర్యటన ముగించుకున్న మోదీ
 • యూఏఈ చేరుకున్న వైనం
 • అబుదాబిలో మోదీకి ఆత్మీయ స్వాగతం
 • తనను కదిలించివేసిందన్న మోదీ


..Read this also
సంజ‌య్ రౌత్‌కు మ‌రోమారు ఈడీ స‌మ‌న్లు
 • న‌గ‌దు అక్ర‌మ లావాదేవీల‌పై రౌత్‌పై ఈడీ కేసు
 • మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు రావాలంటూ నిన్న‌నే ఈడీ నోటీసులు
 • వేరే కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల్సి ఉంద‌ని రౌత్ స‌మాధానం
 • జులై 1న విచార‌ణ‌కు రావాలంటూ తాజాగా ఈడీ స‌మ‌న్లు

..Read this also
ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌
 • చెన్నై ప‌ర్యట‌న‌లో ఉప‌రాష్ట్రప‌తి
 • స్వామినాథన్ ఇంటికి వెళ్లిన వెంక‌య్య‌
 • వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ఆరోగ్యంపై ఆరా


More Latest News
Telangana High Court rejects minister Koppula Eshwar plea
ap government takes new loan of 3000 crores
Salaar movie update
kishan reddy invites chiranjeevi to pm modis bheemavaram tour
Vishnu Vardhan Reddy reacts on Dharmavaram incident
UAE President welcomes prime minister Narendra Modi at Abu Dhabi airport
Gopichand Interview
ed fresh notices to shiv sena mp sanjay raut
Nadendla condemns attack on BJP leaders in Dharmavaram
Attack on BJP leaders in Dharmavaram press club
venkaiah naidu visits ms swaminathan house
Lets step on the moon NASA launches Capstone satelite
AP EAMCET hall tickets released
Prabha in Maruthi Movie
ts sm kcr ianugurates t hub 2
..more