దూసుకుపోతున్న 'మహా సముద్రం' ట్రైలర్!

24-09-2021 Fri 17:37
advertisement

లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ సమపాళ్లలో కలుపుకుని 'మహాసముద్రం' కథను అజయ్ భూపతి తయారుచేసుకున్నాడు. శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులుగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు. కథానాయికలుగా అదితీ రావు - అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చాలా వేగంగా ఈ సినిమా 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టింది. ప్రధానమైన పాత్రలను .. ఆ పాత్రల స్వభావాలను .. ఆ పాత్రలకి సంబంధించిన ఎమోషన్స్ ను ఈ ట్రైలర్ లో గొప్పగా ఆవిష్కరించారు.

దాంతో ఈ ట్రైలర్ చాలామందికి బాగా నచ్చేసింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచాలనే దర్శకుడి ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అటు శర్వానంద్ కీ .. ఇటు అజయ్ భూపతికి చాలా అవసరం కూడా.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement