రెండేళ్ల క్రితం ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రోజే.. కవలలు జననం!

19-09-2021 Sun 19:16
advertisement

విధి నాటకం అంటే ఇదేనేమో? రెండేళ్ల క్రితం సరిగ్గా అదే రోజున ఆ ఇంట విషాదం తాండవం చేసింది. ఇద్దరు కుమార్తెలను పడవ ప్రమాదంలో కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలు పిక్కటిల్లేలా ఏడ్చారు. ఇదిగో ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆ ఇంట నవ్వులు పూస్తున్నాయి. ఇద్దరు ఆడపిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అంటే 2019 సెప్టెంబరు 15న గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సుమారు 50 మంది మరణించారు. వారిలో విశాఖపట్టణానికి చెందిన ఒక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది అదే సెప్టెంబరు 15న ఆ దంపతులకు కవలలు పుట్టారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలే కావడం విశేషం. పండంటి పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది తమకు దేవుడిచ్చిన వరమని అంటోంది.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement