రోదసీ యాత్ర దిగ్విజయం.. 3 రోజుల తర్వాత భూమ్మీదకు తిరిగొచ్చిన నలుగురు సామాన్యులు.. వీడియో ఇదిగో

19-09-2021 Sun 13:09
Inspiration 4 Crew Back To The Earth After 3 Days Of Roaming In Space Their Crew Capsule Splash Down in Florida Coast

స్పేస్ ఎక్స్ నిర్వహించిన ఇన్ స్పిరేషన్ స్పేస్ టూర్ విజయవంతంగా పూర్తయింది. మూడు రోజుల పాటు అంతరిక్షంలో భూకక్ష్యలో గడిపిన నలుగురు సామాన్యులు తిరిగి భూమ్మీదకు వచ్చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో వారి క్రూ క్యాప్సూల్ డ్రాగన్ సురక్షితంగా దిగింది. పూర్తి స్థాయి ఆస్ట్రోనాట్లు లేకుండానే నలుగురు సామాన్యులు రోదసీలోకి వెళ్లిరావడం ఇదే తొలిసారి కావడం విశేషం.


‘ఇన్ స్పిరేషన్ 4’ పేరిట ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మూడు రోజుల క్రితం ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఫాల్కన్ 9 హెవీ రాకెట్ ద్వారా డ్రాగన్ క్రూ క్యాప్సూల్ లో జరెడ్ ఐజాక్ మ్యాన్, క్రిస్ సెంబ్రోస్కీ, హేలీ ఆర్బినో,  సియాన్ ప్రోక్టర్ లు అంతరిక్షంలోకి వెళ్లారు. మామూలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) 420 కిలోమీటర్ల ఎత్తులోనే ఉంటుంది.

కానీ, ఈ ప్రయోగంలో భాగంగా దాని కన్నా ఎత్తులో డ్రాగన్ క్యాప్సూల్ కక్ష్యలోకి వెళ్లింది. 575 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరిగింది. గంటకు 27,360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన డ్రాగన్.. 90 నిమిషాలకోసారి భూమిని చుట్టేసింది. ఈ ప్రయోగం సక్సెస్ తో మానవసహిత అంతరిక్ష యాత్రల్లో మరో ముందడుగు పడినట్టయింది.

..Read this also
మన శరీరం ఏడేళ్లకోసారి సరికొత్తగా.. అదెలా?
  • దాదాపు అన్ని అవయవాల్లో కొత్త కణాలు
  • కొన్నింటిలో వేగంగా.. మరికొన్నింటిలో మెల్లగా భర్తీ 
  • మెదడు, గుండె కణాల్లో చాలా వరకు జీవితాంతం అవే..
  • జీవసంబంధిత వయసు వల్ల అసలు వయసు పెరుగుతుందన్న శాస్త్రవేత్తలు


..Read this also
చందమామపై అడుగు పెట్టేద్దాం.. ముందస్తు శాటిలైట్ క్యాప్ స్టన్ ను ప్రయోగించిన నాసా
  • సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి వెళ్లేందుకు మార్గం సుగమం
  • ఆర్టిమిస్–1 మిషన్ లో భాగంగా నాసా తాజా ప్రయోగం
  • నాలుగు నెలల తర్వాత చంద్రుడి సమీప కక్ష్యలోకి చేరనున్న ఉప గ్రహం

..Read this also
విమానం కాదు ‘బాహుబలి’ హోటల్​.. ప్రపంచమంతా తిరుగుతూ ఎంజాయ్​ చేయొచ్చు!
  • ఒకేసారి 5 వేల మందికిపైగా ప్రయాణించే అవకాశం
  • క్రూయిజ్ షిప్ తరహాలో అత్యాధునిక సౌకర్యాలు
  • అణు ఇంజన్లతో గాల్లోనే చక్కర్లు.. యెమెన్ కు చెందిన సైన్స్ ఇంజనీర్ డిజైన్
  • సినిమా హాళ్ల నుంచి స్విమ్మింగ్ పూల్స్ దాకా అందుబాటులో..


More Latest News
eknath shinde and devendra fadnavis takes oath as cm and deputy cm respectively
ISRO successfully conducts PSLV C53 voyage
bjp orders devendra fadnavis top take charge as maharashtra deputy cm
Eknath Shinde make a video call to rebels after finalized CM post
ap government extends 5 days work for one more year to amaravati employees
The Warrior Movie Update
4 bjp ghmc corporators and tandur minicipality bjp floor leader swift to trs
Russian troops leaves Snake Island
ap government hikes diesel cess in apsrtc buses
Sarkaru Vaari Paata movie update
Pranitha displays placard on Jaipur incident
Activists have no value in TRS Confidence in Congress is gone Joining BJP says Konda Vishweshwar Reddy
Sajjala opines on laptops issue
amaravati mp navneet kaur rana meets draupadi murmu in delhi
Dasara movie upadate
..more