అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశ్చర్యపరుస్తున్న 'లవ్ స్టోరీ'

18-09-2021 Sat 11:05
advertisement

సెకండ్ వేవ్ తరువాత సినిమా థియేటర్లు ఓపెన్ చేసి చాలా రోజులే అయింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనుకునే కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి, తమ సినిమాలను థియేటర్లకు తీసుకొచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో థియేటర్ల దగ్గర సందడి మాత్రం కనిపించలేదు.

ఈ మధ్య కాలంలో థియేటర్ల దగ్గర పట్టుమని ఓ పది రోజులు నిలబడిన సినిమా ఏదైనా ఉందీ అంటే అది 'సీటీమార్' అనే చెప్పుకోవాలి. మాస్ అంశాలు పుష్కలంగా ఉండటం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీన 'లవ్ స్టోరీ' రంగంలోకి దిగుతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోందని అంటున్నారు. ఎక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినా, క్షణాల్లో టికెట్లు అమ్ముడవుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని చాలా మల్టిప్లెక్స్ లలో మొదటి రోజు షోలకు సంబంధించిన బుకింగ్స్ చాలావరకూ జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాతో థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టేనని చెప్పుకుంటున్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement