దూసుకుపోతున్న 'లవ్ స్టోరి' ట్రైలర్!

14-09-2021 Tue 17:50
advertisement

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమా రూపొందింది. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. చాలా వేగంగా ఈ ట్రైలర్ 5 మిలియన్ ప్లస్ వ్యూస్ ను .. 300 K ప్లస్ లైక్స్ ను సాధించింది.

 మొదటి నుంచి ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఇందుకు నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఒక వైపు హీరో .. మరో వైపు హీరోయిన్ జీవితంలో తమ కాళ్లపై తాము నిలబడటానికి ఇద్దరూ  ప్రయత్నించి,  చివరికి కలిసి పోరాడాలనే నిర్ణయానికి రావడం ఈ ట్రైలర్ లో చూపించారు. కథలోని సారాంశాన్ని ఈ  ట్రైలర్ తో చెప్పేశారు. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఈశ్వరీరావు .. దేవయాని ముఖ్యమైన పాత్రలను పోషించారు.


Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement