పేద కుటుంబానికి అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్

14-09-2021 Tue 10:52
advertisement

ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఓ కుటుంబానికి ఆయన జేసీబీని అందజేశారు. తాను స్థాపించిన 'ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్' తరపున దీన్ని అందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ కుటుంబానికి జేసీబీ అందించామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జీవితాన్ని తిరిగి ఇవ్వడంలో ఉన్న ఆనందమే వేరని ఆయన అన్నారు.

ప్రస్తుతం వివిధ భాషల్లో ప్రకాశ్ రాజ్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అంతేకాదు 'మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికల బిజీలో ఆయన ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ లో జీవిత, హేమ కూడా ఉన్నారు.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement