'సలార్' కోసం భారీ యాక్షన్ ఎపిసోడ్!

13-09-2021 Mon 12:27
advertisement

ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'రాధే శ్యామ్' రెడీ అవుతోంది. పునర్జన్మలతో ముడిపడిన ఈ ప్రేమకథ, సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. రొమాంటిల్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, 'సలార్'ను పూర్తిచేసే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. గత రెండు షెడ్యూల్స్ లోను యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరించిన ప్రశాంత్ నీల్, మూడవ షెడ్యూల్ ను కూడా యాక్షన్ సీన్స్ కోసమే కేటాయించాడట.

ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ కీలకం .. సినిమాలో సగం బడ్జెట్ వాటి కోసమే కేటాయించారు. ఒక వైపున కరోనా, మరో వైపున వర్షాల కారణంగా తరువాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ అలరించనున్న సంగతి తెలిసిందే.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement