'పుష్ప' చెల్లెలుగా యంగ్ హీరోయిన్!

13-09-2021 Mon 11:18
advertisement

అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కాకినాడ పోర్టు వద్ద జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో బన్నీకి ఒక సిస్టర్ ఉంటుందనీ .. కథలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఒక భాగమనే టాక్ వచ్చింది. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ తాజాగా 'వర్ష బొల్లమ్మ' పేరు తెరపైకి వచ్చింది. ఇంతకుముందు ఈ అమ్మాయి తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్'లో హీరోయిన్ గా చేసింది. 'పుష్ప' సినిమా కోసం ఈ అమ్మాయిని తీసుకున్నారనే విషయంలోను క్లారిటీ రావలసి ఉంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ కనిపించనున్నాడు. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement