సితార బ్యానర్లో బాలకృష్ణ మూవీ!

13-09-2021 Mon 10:34
advertisement

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమా రూపొందుతోంది. ఈ నెలతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దీపావళికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితం కానుంది.

భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు బాలకృష్ణతో ఒక సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్ తో ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. ఈ కథ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందని చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement